ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన శ్రీరామ్ ఫైనాన్స్

ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచినశ్రీరామ్ ఫైనాన్స్

  • ఎఫ్ డి లపై 8.90% దాకా వడ్డీని ఆర్జించండి, అక్టోబర్ 14, 2022 నుంచి అమల్లోకి
  • 12 నెలల నుంచి 60 నెలల కాలానికి సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి
  • మహిళా కస్టమర్లు అన్ని ఎఫ్ డి రేట్లపై 10 బీపీఎస్ అదనంగా పొందుతారు

హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద అసెట్ ఫైనాన్సింగ్ కంపెనీలలో ఒకటైన, శ్రీరామ్ గ్రూప్ లో భాగమైన శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్టీఎఫ్ సి) మరియు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ కాలవ్యవధుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ రేట్లలో 5 నుంచి 25 బేసిస్ పాయింట్స్ (0.05%p.a. to 0.25%p.a.) పెంపును ప్రకటించాయి. 2022 అక్టోబర్ 14 నుంచి కస్టమర్లు 8.90% దాకా వడ్డీని ఆర్జించవచ్చు. మహిళలకు ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా ప్రకటించింది. మహిళా డిపాజిటర్లు అన్ని ఎఫ్ డి రేట్లపై అదనంగా సంవత్సరానికి 10 బీపిఎస్ పొందగలుగుతారు. శ్రీరామ్ సిటీ లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్ క్రిసిల్, ఐసిఆర్ఎ, ఇండియా రేటింగ్స్   నుంచి AA గా ఉంది. శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ క్రిసిల్ రేటింగ్ AA+/Stable గా ఉంది.

ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు

కాలవ్యవధి   ప్రస్తుత వడ్డీ రేటు (p.a.)  2022 అక్టోబర్ 14 నుంచి వర్తించే సవరించిన వడ్డీ రేట్లు  (p.a.)వడ్డీ రేటులో పెంపు (p.a.) 
12  నెలలు6.75%7.00%0.25% (25 బేసిస్ పాయింట్స్)
18 నెలలుN.A.7.30%కొత్త రేట్లు
24 నెలలు7.25%7.50%0.25% (25 బేసిస్ పాయింట్స్)
30 నెలలు8.00% (ఆన్ లైన్ మాత్రమే)8.00% (ఇప్పుడు ఆఫ్ లైన్ లో కూడా)
36 నెలలు8.00%8.05%0.05% (5 బేసిస్ పాయింట్స్)
42 నెలలుN.A.8.15%కొత్త రేట్లు
48 నెలలు8.15%8.20%0.05% (5 బేసిస్ పాయింట్స్)
60 నెలలు8.25%8.30%0.05% (5 బేసిస్ పాయింట్స్)

సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు 0.50% p.a. అదనపు వడ్డీ చెల్లించబడుతుంది (డిపాజిట్ / రెన్యువల్ తేదీ నాటికి 60 ఏళ్లు పూర్తయిన వారికి).

డిపాజిట్ మెచ్యూర్ అయిన పక్షంలో అన్ని రెన్యువల్స్ పై 0.25% p.a. అదనపు వడ్డీ చెల్లించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *