పేద రెడ్లను ప్రభుత్వం ఆదుకోవాలి – రెడ్డి సంక్షేమ సంఘం – ముశిపట్ల

పేద రెడ్లను ప్రభుత్వం ఆదుకోవాలి : రెడ్డి సంక్షేమ సంఘం – ముశిపట్ల

మోత్కూరు, 29 మే, 2022: ‘రెడ్ల సింహా గర్జన కు రెడ్డి సంక్షేమ సంఘం – ముశిపట్ల తరపున మద్దతు తెలియజేస్తూ సభలో పాల్గొన్న ముషిపట్ల రెడ్లు“ఐదు వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి. జాతీయ స్థాయిలో ews కమిషన్ ఏర్పాటు చేయాలి. 50 ఏండ్లు నిండిన రైతులకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. అన్ని వర్గాల మాదిరిగా పేద రెడ్డి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలి.” అని రెడ్డి సంక్షేమ సంఘం ముశిపట్ల తరపున ముప్ప రాజు రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సభలో అధ్యక్షుడు పైళ్ళ యాదిరెడ్డి, సెక్రెటరీ ముప్ప రాజు రెడ్డి, ఉపాధ్యక్షులు పాటి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కొనతం అర్జున్ రెడ్డి, కొనతం సుదర్శన్ రెడ్డి, బిల్లకంటి ఆంజనేయులు, పైళ్ల రాంరెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.